telugu navyamedia
రాజకీయ

కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్‌..18 మందికి ఛాన్స్..

మహారాష్ట్రలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. మొత్తం 18 మందితో మహారాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరింది. 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు.

మంగళవారం ముంబైలోని రాజ్‌భవన్‌లో జ‌రిగిన  కార్యక్రమంలో గవర్నర్ బీఎస్​ కోశ్యారీ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణస్వీకారం జరిగింది.

Maharashtra cabinet expansion today, 18 ministers likely to be sworn in |  Mint

ఉముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గం

చంద్రకాంత్ పాటిల్,సుధీర్ ముంగటివార్,గిరిష్ మహాజన్,మంగల్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావె,సురేశ్ ఖాడె,రాధాకృష్ణ వీఖే పాటిల్,రవీంద్ర చవాన్

శివసేన వర్గం

దాదా భూసే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, దీపక్ కేసార్కర్, గులాబ్​రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్​​ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కాగా బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related posts