telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్…. సోమరిపోతులు, కామెడియన్ల పార్టీ

బీజేపీకి .. కేటీఆర్ వేసిన ప్రశ్నల్లో లాజిక్ లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ ఇంకా గెలవాలనుకోవటం కల్ల అని..  టీఆర్ఎస్.. సోమరిపోతులు, కామెడియన్ల పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందంతో కేసీఆర్.. బాబుమోహన్ తో కేటీఆర్ పోటీపడ్తున్నారని…ఒక్క పరిశ్రమను కూడా కేటీఆర్ హైద్రాబాద్ కు తీసుకురాలేకోయాడని మండిపడ్డారు. మూసీనదిలో బోటింగ్ చేస్తునట్టు… కేసీఆర్, కేటీఆర్ ఎదురు పడినట్లు నాకు కలలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే.. లాక్ డౌన్ సమయంలో కేటీఆర్ సినిమాలు చూస్తుకూర్చోచటం సిగ్గుచేటని…సచివాలయం పోని కేసీఆర్ .. దేశానికి దిశ దశా చూపుతామనటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రల్లో సైతం 24గంటల కరెంట్ ఇస్తున్నారని.. కేసీఆర్ కుటుంబం నెలకు 15లక్షల జీతం తీసుకుంటుందన్నారు. బీజేపీ మ్యానిఫెస్టో వచ్చాక.. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెబ్ సైట్ లో కన్పించదని పేర్కొన్నారు.మేయర్ సీటు బీజేపీకి ఇస్తే.. వరద బాధితులకు 25వేల ఆర్థిక సాయం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఆరున్నరేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని..తెలంగాణను గుజరాత్ చేయటమే బీజేపీ లక్ష్యమన్నారు.
SEC తెలంగాణ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అని ఫైర్‌ అయ్యారు ఎంపీ ధర్మపురి అరవింద్.

Related posts