ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పరీక్షలో 66.15 శాతం ఉత్తీర్ణత నమోదయిందని తెలిపారు. దాదాపు 40,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని చెప్పారు. ఏపీలో గత నెల 17 నుంచి 29 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలను http://push159.sps.ap.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స