telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ఎందుకు వణికిపోతున్నాడు: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నారా లోకేశ్ మరోసారి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ ఎందుకు వణికిపోతున్నాడని ప్రశ్నించారు. మండలిని రద్దు చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ప్రజలు కోరుకున్నది కాదని, తన స్వార్థ నిర్ణయం అని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడని లోకేశ్ ఆరోపించారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు” అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని పేర్కొన్నారు. “వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టులను రద్దు చేస్తారా? లేకపోతే, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఏకంగా శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?” అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

Related posts