telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : పంజాబ్ లక్ష్యం 165

ఈ రోజు ఐపీఎల్ లో అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ను పంజాబ్ బౌలర్లు పవర్ ప్లే లో బాగానే కట్టడి చేసారు. మొదటి 6 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించారు. కానీ 5 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. కేవలం 28 బంతుల్లో 57 పరుగులు చేసాడు. దాంతో కోల్‌కత నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ కు తోడుగా ఓపెనర్ శుబ్మాన్ గిల్ 47 బంతుల్లో 57 పరుగులు చేసాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ సాధించగా మరో మూడు వికెట్లు రన్ ఔట్ రూపంలో జట్టుకు లభించాయి. ప్రస్తుతం పంజాబ్ ముందు ఉన్న లక్ష్యం 165 పరుగులు. అయితే ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లలో 5 ఓడిపోయిన పంజాబ్ కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. చూడాలి మరి ఈ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదిస్తుందా అనేది.

Related posts