telugu navyamedia
సినిమా వార్తలు

సోహెల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గ్లింప్స్‌

తెలుగు బిగ్ బాస్-4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి.

ఈ సినిమాతో వింజనపాటి శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ టీవీ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుహాసిని, బ్రహ్మాజి, అలీ, హర్ష తదితర పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని చిత్రబృందం అంటుంది.

Related posts