telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన 70 సంవత్సరాల “వద్దంటే డబ్బు”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన పూర్తి హాస్యభరిత చిత్రం రోహిణీ పిక్చర్స్ వారి “వద్దంటే డబ్బు” చిత్రం 19-02-1954 విడుదలయ్యింది.

ప్రముఖ నిర్మాత హెచ్.యమ్.రెడ్డి సమర్పణలో నిర్మాతలు హెచ్.ఎం.రెడ్డి, మూల నారాయణ స్వామి రోహిణీ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు వై.ఆర్.స్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి మాటలు: సదాశివబ్రహ్మం, పాటలు: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ , సదాశివ బ్రహ్మం, సంగీతం: టి.ఏ.కళ్యాణ రామన్, ఫోటోగ్రఫీ: డి.ఎల్. నారాయణ, కళ: ఎల్.వి.మాండ్రే, నృత్యం:ఏ.కె.చోప్రా, ఎడిటింగ్: ఎం.ఎస్.పార్థసారధి, అందించారు

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షావుకారు జానకి, పేకేటి శివరామ్, జమున, రాజనాల, హేమలత, అల్లు రామలింగయ్య, హేమలత, గంగారత్నం, సుబ్బారావు, కృష్ణమూర్తి, తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు టి.ఏ. కళ్యాణరామన్ సారధ్యంలో వచ్చిన పాటలు
“అల్లదే అవతల అదిగో నాప్రియ కుటీరవాటిక”
“ఎందుకోయీ హాయి నాకు,ఎందుకమ్మా బిడియము”,
“మనసే చలించిపోయే,ప్రియుడే కనరాడాయే”
“ఎవరో దోషులు మీలో మీరు,ఎందుకో రాజా”
శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో సమాంతరంగా నిర్మించారు.
తెలుగు చిత్రం “వద్దంటే డబ్బు” 19-02-1954 విడుదల కాగా తమిళంలో “పానం పడుతుం పాడు” పేరుతో 04-03-1954 న విడుదల అయ్యింది.

ఈ సినిమా లో ఎన్టీఆర్ గారికి పాటలు లేవు. ఎన్టీఆర్ తో జతగా షావుకారు జానకి, పేకేటి శివరాం కు జతగా జమున నటించారు హాస్య రసం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా యావరేజ్ గా నడించింది. ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది.

ఈ సినిమా విజయవాడ — శ్రీరామాటాకీస్ లో 55 రోజులు ప్రదర్శింపబడింది…
ఈ సినిమా కథ ఆధారంగా 1985 లో నందమూరి బాలకృష్ణ హీరోగా “బాబాయ్ అబ్బాయ్” పేరు తో సినిమా నిర్మించారు….

Related posts