telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇక రైతులపై పడిపోయిన మోడీ.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు !

దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఇప్పటికే రూ.100లకు చేరాయి చమురు ధరలు. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళో, రేపో ఏపీలోనూ పెట్రోల్‌ ధరలు సెంచరీ కొట్టేయనుంది. ఇలా పెట్రోలు నుంచి వంట నూనెల వరకు అన్ని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు మోడీ ప్రభుత్వం మరో షాక్‌ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఎరువుల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించింది. 50 కిలోల ఎరువుల బస్తాపై గరిష్టంగా రూ. 250 వరకు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎరువుల ధరలను పెంచేయగా.. మరికొన్ని వచ్చే నెల 1 నుంచి పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు రూ. 890 గా ఉన్న 20-20-0 రకం ఎరువుల బస్తా నిన్నటి నుంచి రూ. 998కి పెరిగింది. రూ. 975 గా ఉన్న ఈ బస్తా ఎమ్మార్పీ ఏకంగా రూ. 1125కు పెరగడం గమనార్హం. అలాగే, 1275 గా ఉన్న డీఏపీ బస్తా ధర రూ. 1450 కి పెరిగింది. పెంచుతున్న ధరల వివరాలను కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. మిగతా సంస్థలు మరో 15 రోజుల్లో ధరలు పెంపును ప్రకటించనున్నాయి.

Related posts