telugu navyamedia
సినిమా వార్తలు

కొమురం భీముడో ఫుల్‌ వీడియో సాంగ్ రిలీజ్ ..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఆర్ ఆర్ ఆర్ . ఇందులో కొమురం భీముడిగా, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు.

ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు.

RRR: New posters feature Jr NTR as Komaram Bheem, Ram Charan as Alluri  Sitarama Raju | The News Minute

ఈ సినిమా గురించి మరో పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. తాజాగా మరో పాట ఈరోజు సాయంత్రం కొమురం భీముడో.. కొమురం భీముడో.. అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌.

RRR': Promo of 'Komuram Bheemudo' drops - Telugu News - IndiaGlitz.com

ఈ పాట లిరికల్ వీడియో విన్నప్పుడే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చిన విషయం విదితమే.ఇక వీడియో సాంగ్ చూస్తుంటే రక్తం మరిగిపోవడం ఖాయం. బ్రిటిష్ సైన్యం ముందు రామరాజు చేతిలో కొమురం భీమ్‌ దెబ్బలు తినే సమయంలో  కొమరం భీమ్ పాడే ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది

సుద్దా అశోక్‌ తేజ రాసిన లిరిక్స్‌ తూటాల్లా పేలగా కాల భైరవ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts