telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ బాలీవుడ్ నటుడి కన్నుమూత

Viju

ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ కోఠె కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి నందూ కొఠె రంగస్థల నటుడు, అత్త దుర్గ కొఠె ప్రముఖ నటి. వీజూ కొఠె అక్క శుభ కోఠె కూడా సీనియర్ నటి. షోలే, అందాజ్ అప్నా అప్నా, ఖుర్బాని, ఖర్జ్, నగీనా, చైనాగేట్ తదితర చిత్రాల్లో నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 1964 సంవత్సరంలో యా మలక్ చిత్రంలో చేసిన పాత్ర తన సినీ జివితాన్ని మలుపు తిప్పింది. ఆయన నటించిన చివరి చిత్రం “జానే క్యొ దె యారాన్”. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related posts