telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గ్రామ, వార్డు వలంటీర్లకు షాకిచ్చిన ఏపీ సర్కార్‌…

cm jagan

గ్రామ, వార్డు వలంటీర్లకు దిమ్మ దిరిగే షాక్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు వలంటీర్ల విషయంలో కీలక సర్కులర్ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లుగా 18-35 ఏళ్ల మధ్యనున్న వారినే కొనసాగించాలని జిల్లాల జేసీలకు ఆదేశించింది. 18 ఏళ్ల లోపు.. 35 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తప్పించాలని సూచనలు చేసింది. ప్రభుత్వ ఆదేశం తో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు దూరమవుతారంటూ ప్రచారం సాగుతోంది. కేవలం పది మంది మాత్రమే నిబంధనలకు విరుద్దంగా రిక్రూట్మెంట్ జరిగిందని అధికారులు అంటున్నారు. తొలగించబోయే వలంటీర్లకు జీతాలు చెల్లిస్తామంటోన్న అధికారులు…. నిబంధనలకు విరుద్దంగా కొందరు వలంటీర్ల నియామకం జరిగిందని ఫిర్యాదులు అందాయని సర్కులర్లో పేర్కొంది ప్రభుత్వం. సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపులు కావడంతో వెలుగులోకి వచ్చాయి సంచలన విషయాలు. ఇక గ్రామ, వార్డు వలంటీర్ల ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం.

Related posts