telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ న్యూ లుక్ అదిరింది

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న “సైరా” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవలె ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ రెండో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్‌తో అదరగొడుతున్నారు. యంగ్ లుక్, సన్నబడిన శరీరంతో చిరంజీవి యువకుడిలా మారిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కోడలు ఉపాసన నిర్వహిస్తున్న `బి పాజిటివ్` మేగజైన్ కోసం చిరంజీవి ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ కొత్త లుక్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Related posts