telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొందరు నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు… బ్రేకప్ పై స్పందించిన శృతిహాసన్

Shruthi-Hassan

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పీక్‌లో ఉన్న దశలోనే లండన్‌కు చెందిన గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. ఆ క్రమంలో కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేసింది. అయితే మైకేల్‌తో ఆమె ప్రేమ ఎంతో కాలం కొనసాగలేదు. మైకేల్‌తో ప్రేమకు బ్రేకప్ చెప్పేసి మళ్లీ కెరీర్‌పై శృతి దృష్టి పెట్టింది. అయితే మైకేల్‌తో విడిపోవడానికి గల కారణాన్ని ఇప్పటివరకు ఎక్కడా వెల్లడించలేదు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరైన శృతి తన బ్రేకప్ గురించి తొలిసారి మాట్లాడింది. “బయటకు కఠినంగా కనిపించినా నేను చాలా అమాయకంగా ఉంటాను. నేను చాలా ఎమోషనల్. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. నన్ను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. అయితే అవన్నీ నాకు మంచి అనుభవాలే. మైకేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం” అని శృతి చెప్పింది.

Related posts