ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. ముంబై జట్టుతోనే యూఏఈ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాడు. టీమిండియా అప్‌కమింగ్ సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపికైనా.. టీమిండియా ఆటగాళ్ల బయోబబుల్‌లో హిట్‌మ్యాన్ చేరలేదు. ఫైనల్ అనంతరం ఇతర ముంబై ఆటగాళ్లు టీమ్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనకుండా బబుల్‌లో చేరగా రోహిత్ మాత్రం జట్టుతోనే ఉండిపోయాడు. అయితే రోహిత్ భారత జంబో జట్టుతో ఆసీస్ వెళ్లడం లేదని, ప్రత్యేకంగా వెళ్లనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘ముంబై జట్టుతోనే రోహిత్ భారత్‌కు రానున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకోనున్నాడు. దివాళి పండుగును కుటుంబంతో జరుపుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఎన్‌సీఏలో గాయానికి చికిత్స తీసుకోనున్నాడు. టెస్ట్ టీమ్‌లో అవకాశం అందుకున్న రోహిత్.. కోహ్లీ గైర్హాజరీలో కీలకం కానున్నాడు.
మంగళవారం జరిగిన ఫైనల్ అనంతరం ఇక లాస్ట్ బ్యాచ్ ఆటగాళ్లు బబుల్‌లో కలిసారు. సదరు ఆటగాళ్లంతా హోటల్లో నిర్వహించిన ముంబై సెలెబ్రేషన్స్‌ను మిస్సయ్యారు.’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. రోహిత్ శర్మ గాయపడటంతో తొలుత ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయని టీమిండియా సెలెక్షన్ కమిటీ.. ఆ తర్వాత అతను మ్యాచ్ బరిలోకి దిగడం.. విరాట్ చివరి మూడు టెస్ట్‌లకు లీవ్ తీసుకున్న నేపథ్యంలో అవకాశం కల్పించింది. గాయం దృష్ట్యా టీ20, వన్డేలకు విశ్రాంతి కల్పించిన సెలెక్షన్ కమిటీ..టెస్ట్ టీమ్‌లోకి తీసుకుంది. కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. జనవరిలో తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే.
మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్