telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా… క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. తాజాగా ఈ హీరో విలక్షణ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ ఇంద్రగంటి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “విజయ్‌కి బర్త్ డే విషెస్ చేస్తూ.. ఈ ఏడాది నీ నుంచి ఇంకా మంచి సినిమాలు రావాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. దీనికి విజయ్ బదులిస్తూ.. “థాంక్యూ.. నాకు తెలుసు.. ఆ అద్భుతం మనిద్దరం కలిసి చెయ్యబోతున్నాం” అని రీట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీటిపై ఏ విషయమన్నది లాక్‌డౌన్ తర్వాత తేలనుంది.

మరోవైపు ‘ఫైటర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 40 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే మొత్తం సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. కాగా ఇప్పటికే ఈ సినిమాతో పాటు మరో కొన్ని ప్రాజెక్టులకు కూడా రౌడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫైటర్ సినిమా తర్వాత, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

Related posts