telugu navyamedia
రాజకీయ వార్తలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు..ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు

karona

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి.  ఈ  క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇటీవల బెంగళూరులో పది రోజుల క్యాంపు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు హర్యానాలోక్యాంపు రాజకీయాలు చేశారు.

ఎమ్మెల్యేలు బసచేసిన ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తరుణ్‌ భానోత్‌ నిన్న రాత్రి తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు నిర్వహించాల్సిన బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది.

 

Related posts