telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా ప్రకటనలను అతనే నియంత్రించాడు… “గురూజీ” అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు

Poonam Kaur

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడంతో సినీ పరిశ్రమలోని పరిస్థితులపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీకే చెందిన కొంతమంది తమకు ఎదురైన అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించారు. ఓ అగ్ర దర్శకుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “పూనమ్‌ పరిస్థితి బాగోలేదని, ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, ఇలాంటి పరిస్థితిలో మీరు ఆమెకు అండగా ఉండాలని నా ఫ్రెండ్ ఒకరు ఆ డైరెక్టర్‌ను కలిశారు. ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు కలిశారు. కానీ, ఆ డైరెక్టర్ పట్టించుకోలేదు. ఆలస్యం చేస్తూనే వచ్చాడు. మాయమాటలు చెబుతూ తప్పించుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంకేం చేస్తాంలే అని నేను ఊరుకున్నాను. ఆ తరవాత నా పరిస్థితిని మార్చగలరా అని నేనే నేరుగా ఆయన్ని అడిగాను. నాకు అనారోగ్యంగా ఉందని, చచ్చిపోవాలని అనిపిస్తోందని చెప్పాను. అప్పుడు ఆ డైరెక్టర్ ‘ఏం జరుగుతుంది.. నువ్వు చచ్చిపోతే ఒక్క రోజు న్యూస్‌లో ఉంటావ్’ అన్నాడు. ఈ ఒక్క మాట, అతని తప్పించుకునే స్వభావం చూసి నా మీద నాకే అసహ్యం వేసింది. మీడియాను అతను నియంత్రించాడు. మూవీ మాఫియాను కూడా నియంత్రించాడు. నా ప్రకటనలను అతనే నియంత్రించాడు. పరోక్షంగా నా మీద ఆన్‌లైన్‌లో ఆర్టికల్స్ రాయించి నన్ను మరింత డిప్రెషన్‌లోకి నెట్టేశాడు. అనవసరపు వార్తలు నన్ను మరింత కుంగదీశాయి. వీటన్నింటినీ నేరుగా నేను ఒకే ఒక్క రిప్లై ఇచ్చాను. ఆ మనిషితో నా ప్రయాణం ఎలా సాగిందంటే.. ‘మధ్య రాత్రి కూడా సమస్య వస్తే నేను వస్తాను నుంచి నువ్వు చచ్చిపోతే ఒక్క రోజు న్యూస్‌లో ఉంటావు వరకు’ వచ్చేసింది. అసలు అప్పట్లో నా పరిస్థితి ఎందుకు బాగోలేదు? ఇప్పటికీ అలానే ఉంది. దీనికి కారణం నువ్వే. సినిమా నటీనటుల జాబితా నుంచి నా పేరును తీసేశావ్. ఆడియో ఫంక్షన్ నుంచి నా ఫొటోలు తొలగించావ్. నువ్వు చేసింది ఇప్పటికీ నాకు గుర్తుంది. సావిత్రి గారు గురించి వేదికపై గొప్పగా మాట్లాడే నువ్వు లోకల్ టాలెంట్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవు. అమ్మాయి బాగుందని ఇండస్ట్రీ వాళ్లు అనుకొని అవకాశం ఇస్తే నువ్వు ఆపేస్తావ్. నీకు మంత్రుల కొడుకులు తెలుసు. పెద్ద పెద్ద కుటుంబాలు తెలుసు. అయితే ఏంటి? నువ్వు ఒక రోగివి, మాయగాడివి. నిజానికి నేను ఆ ఒక్క సమస్యను పరిష్కరించమని తప్ప వేరే దేనికోసం అతన్ని కలవలేదు. అతని మాయమాటలు.. మంత్రులు, స్నేహితులు ఇచ్చిన అధికారాన్ని దర్వినియోగం చేసే తత్వం, నచ్చినవాళ్లకే అవకాశం ఇవ్వడం, భజన తప్ప ఇంకేమీ చేయకపోవడం, నన్ను సైలైంట్‌గా బ్యాన్ చేయాలనుకోవడం అన్నీ చేశావ్. ఇన్ని చేసిన నువ్వు గురూజీవి కాదు’’ అంటూ పూనమ్ ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే, ఆమె ట్వీట్లలో గురూజీ అనే హ్యాష్ ట్యాగ్‌ను వాడటం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Related posts