telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు… అంతా బిగ్ బాస్ మహాత్యమే…!

Varun-Sandesh

“హ్యాపీడేస్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్‌కు ‘కొత్త బంగారం లోకం’ కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. ఫలితంగా ఆయనకు వరుస ఆఫర్లు వరించాయి. కానీ అవేవీ ఆకట్టుకోలేకపోయాయి. 2015లో వచ్చిన ‘లవకుశ’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కెరీర్ కొంచెం ట్రబుల్‌లో పడింది. దాదాపు 5 ఏళ్లు పాటు సినిమా అవకాశాల్లేవు. కానీ బిగ్‌బాస్-3 మళ్లీ లైఫ్ ఇచ్చింది. బాగ్ బాస్-3లో నాలుగు స్థానంలో కొనసాగిన ఆయన విన్నర్‌ కాలేకపోయారు. కానీ సినిమాలు అవకాశాలు మాత్రం ఒక్కసారిగా వస్తున్నాయట. ఇప్పటివరకూ 10 సినిమాలకు కథలు విన్నారట. ఓ మల్టీస్టారర్‌కు ఒకే చెప్పారట. ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారట. దీని తర్వాత మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టనున్నారట. వరంగల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా గ్యాప్ తర్వాత వరుస అవకాశాలు వస్తుండటంతో హీరో వరుణ్ సందేశ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారట. బిగ్ బాస్ -3ని మర్చిపోలేనని ఆయన చెబుతున్నారట.

Related posts