telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు ఇంటి గేటు తాకితే.. నీ శవాన్ని పంపుతాం..

గుడివాడ‌లో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కొడాలి నానిని తెదేపా నేత‌లు వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ కొడాలి నాని నీ భాష ఏంటి.. కొడాలి నాని నీ చరిత్ర ఏంటి రా..నువ్వేంటి గ‌డ్డాం మీసం పెంచితే రౌడి అనుకుంటున్నావా అని ప్ర‌శ్నించారు. చంద్రబాబుని ఏమైనా బొడ్డు కోసి పేరు పెట్ట‌వా ..మాట్లాడితే అవాకులు చ‌వాకులు పేలుతున్నావు అని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

కొడాలి నాని వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. మేమేమైనా నీ బావ ,బావమరిది అనుకున్నవా..? వాడు ,వీడు అంటున్నావు అంటూ ద్వజమెత్తారు.

గుడివాడ లో ఆయిల్ దొంగవి.. వర్ల రామయ్య నిన్ను లోపల వేసి చితక బాదాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా.. విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి.. కొట్టుకుందాం రా.. అని సవాల్ విసిరారు.

గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకు వచ్చావు, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీసావు, కొడాలి నాని తోపు అయితే కెమెరా పట్టుకోని చంద్రబాబు ఇంటికి వెళ్ళు.. చూద్దాం. చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామని బుద్దా వెంకన్న అన్నారు

చంద్రబాబు సీఎం అయిన తర్వాతే కొడాలి నానికి టీడీపీలో ప్రవేశం దొరికిందని, హరికృష్ణను మోసం చేసావు. 2004 లో నీకు టికెట్ ఇచ్చింది చంద్రబాబు.. హరికృష్ణ కాదు అని ఆయన అన్నారు. కొడాలి నాని వంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అన్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు కొడాలి నానిని చంపుతారని, ఈలోపే కొడాలి నాని దుబాయ్ పారిపోతాడంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా.. తేల్చుకుందాం అంటూ కొడాలి నానికి సవాలు విసిరారు బుద్దా వెంకన్న.

డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై కూడా బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీయని, డెబ్భై ఏళ్ల వయసున్న చంద్రబాబును తిడుతుంటే డీజీపీ ఎందుకు మాట్లాడరు. కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే డీజీపీ దేశంలో లేరని, ఈ డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదని. డీజీపీ కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయ‌డంలేదో చెప్పాలని బుద్దా వెంకన్న ప్ర‌శ్నించారు.

Related posts