telugu navyamedia
రాజకీయ

బ్రేకింగ్ : శ్రీలంక కొత్త అధ్య‌క్షుడుగా విక్ర‌మ్ సింఘే ఎన్నిక‌ : మ‌ద్దుతుగా 134 ఓట్లు

*శ్రీలంక కొత్త అధ్య‌క్షుడుగా విక్ర‌మ్ సింఘే
*విక్ర‌మ్ సింఘేకు మ‌ద్దుతుగా 134

*శ్రీలంక 8వ అధ్య‌క్షుడుగా విక్ర‌మ్ సింఘే 
*శ్రీలంక అధ్యక్షుడిగా విక్ర‌మ్ సింఘేను ఎన్నుకున్న ఎంపీలు

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. లంక పార్లమెంటులో ఓటింగ్​ నిర్ణయించగా ఈమేరకు నిర్ణయం వెలువడింది.

లంక అధ్యక్షుడి పదవికి రణిల్ విక్రమ సింఘేతో పాటు డల్లాస్ అల్లపెరుమా, అనుర దిస్సనాయకే పోటీ పడ్డారు. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం  225 మంది సభ్యులున్నారు.

బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘేను కొత్త అధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 223 మంది ఓటు వేయగా.. ఇద్దరు ఎంపీలు ఓటు వేయలేదు.  223 ఓట్లలో 219 చెల్లుబాటైన ఓట్లు ఉన్నాయి. మిగతా నాలుగు ఇన్‌వాలిడ్ అని రిటర్నింగ్ అధికారులు తేల్చారు.

ఈ  రోజు జరిగిన ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు రణిల్ విక్రమ సింఘేకు అనుకూలంగా పడడంతో.. ఆయన్ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

Related posts