*చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను
*ఈ వివాదాన్ని మెగా అభిమానులు మర్చిపోవాలి..
*రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి..
*చిరంజీవి క్షమాపణ చేప్పిన సీపీఐ నారాయణ
మెగాస్టార్ చిరంజీవిపై ఇటీవల సీపీఐ నాయకులు నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనారాయణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
దీంతో మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ ప్రకటించారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలను పరిగణించాలని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు మర్చిపోవాలని కోరారు.
చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందని, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తాను కలిస సంఘీభావం తెలిపానని నారాయణ అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేయటం సహజమని, తన మాటలకు నొచ్చుకుంటే క్షమించాలని కూడా నారాయణ అన్నారు.
సీపీఐ నారాయణ నిన్న (జూలై 19) తిరుపతి నిర్వహించిన మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు.
అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. నారాయణ వ్యాఖ్యలపై చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ