telugu navyamedia
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన విపక్షాలు

Ramnath president

పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న హింసాత్మక ఘటనలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జేఎంఐ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో చెలరేగుతోన్న నిరసనల పై విపక్ష పార్టీల నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, ఈ హింసాత్మక ఘటనలను వివరించాలని ఉత్తరాదిలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈ రోజు విపక్ష పార్టీలు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరాయి.

పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న ఆందోళనలపై కేంద్ర హోం శాఖ వర్గాలు స్పందించాయి. నిన్నటి నుంచి జరుగుతోన్న ఘటనలపై ఇప్పటివరకు తాము నివేదిక కోరలేదని ఓ అధికారి మీడియాకు తెలిపారు. తాము ఈ రోజు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు.

Related posts