telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ భవన్‌లో గన్‌తో హంగామా చేసిన టీఆర్‌ఎస్‌ కీలక నేత !‌

తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ విజయంతో టీఆర్‌ఎస్‌ భవన్‌లో నిన్న కార్యకర్తలు, కీలక నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అయితే.. సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నేత గన్‌తో హల్‌చల్‌ చేశాడు. నిన్న ఎమ్మెల్సీ సంబురాల్లో గన్‌ తెచ్చిన గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌… గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్నవారు ఆపడంతో కట్టెల శ్రీనివాస్‌ గన్‌లోపల పెట్టుకున్నాడు. అయితే… దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌కు అసలు ఆ గన్‌ ఎక్కడిది… ఎవరూ ఇచ్చారు అనేది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. అయితే… లైసెన్స్‌డ్‌ అని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. మరీ దీనిపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Related posts