telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రద్ధా కపూర్ కు మానసిక రోగం…!?

Shraddha

శ్రద్ధా కపూర్ తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’‌లో ఇటూ గ్లామర్ విషయంలోనూ, అటూ యాక్షన్ సీన్స్‌లో కూడా అదరగొట్టింది. ప్రస్తుతం శ్రద్ధా ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ అనే డాన్స్ బేస్డ్ సినిమాలో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో ‘బాఘి-3’లోనూ నటించనుంది. ఈ మధ్యే ఆమె నటించిన మరో హిందీ సినిమా ‘చిచ్చోరే’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను ఓ రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది. ఈ సమస్యను గత ఆరేళ్లుగా ఎదుర్కుంటున్నానని, ఓ రకమైన మానసిక రోగంతో పోరాడుతున్నానని చెప్పారు. ఆమె తన సమస్య గురించి మాట్లాడుతూ… “యాంగ్జైటీ అంటే ఏంటో నాకు మొదట తెలియదు. కానీ.. నా మొదటి సినిమా ‘ఆషికీ 2’ తర్వాత నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నానని తెలిసింది. అయితే ఈ వ్యాధిని మిగితా వ్యాధుల వలే పైకి చూసి ఓ వ్యక్తి ఈ సమస్యతో ఉన్నాడని, లేదా బాధపడుతున్నాడని చెప్పలేమన్నారు. దీన్ని మానసికంగానే గుర్తించాలి. ఈ వ్యాధికి సంబందించి నాకు చాలా వైద్య పరీక్షలే జరిగాయి. అయితే ఆ పరీక్షలు గానీ, వైద్యులు గానీ ఎటువంటి సమస్యను గుర్తించలేకపోయారు. అయితే నాకు మాత్రం మానసిక వ్యాధికి సంబందించిన నొప్పి, బాధ వచ్చేవి.. అలా ఎందుకు వచ్చేవో మొదట అర్థమయ్యేది కాదని తెలిపింది. కానీ క్రమంగా ఆ బాధను ద్వేషించి పెంచుకోవడం కంటే స్వీకరించడం వల్ల తగ్గించుకోవడం బెటర్ అని భావించిడంతో ఇప్పుడు శ్రద్ధాకపూర్ ఫేస్ చేస్తున్న సమస్య కాస్త బెటర్‌గా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్.

Related posts