telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్‌ ప్రధానికి కరోనా.. మోడీ ఆందోళన!

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. నిన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కరోనా బారీన పడ్డారు. ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలు కనిపిచడంతో.. ఆయనకు నిన్న కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే.. దీనిపై మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కరోనా బారినపడ్డ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్‌ ప్రధాని మోడీ చేశారు. కాగా.. పాక్‌లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 6,23,135 కరోనా కేసులు నమోదవగా.. 13, 799 మంది కరోనాకు బలయ్యారు.

Related posts