బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి వరకు ఆయన ప్రేమాయణానికి సంబంధించి చాలామంది హీరోయిన్ల పేర్లు విన్పించాయి. కానీ తనకు పెళ్లిపై ఆసక్తి లేదనే విషయం చాలా సందర్భాల్లో ఆయన చెప్పకనే చెప్పారు. 53 ఏళ్ల వయసొచ్చినా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్న సల్మాన్ ఖాన్ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా బయటపెట్టారు. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం కపిల్ శర్మ షోలో పాల్గొన్న సాజిద్, సల్మాన్ పెళ్లి గురించిన విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతగా పేరుపొందిన సాజిద్ నదియాడ్ వాలాకు సల్మాన్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “1999లో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ వచ్చింది. పెళ్లికూతురు కూడా సిద్ధంగా ఉంది. నా కోసం ఓ అమ్మాయిని వెతుక్కోవాలి. సల్మాన్ తండ్రి పుట్టిన రోజు నవంబర్ 18. ఆ రోజే పెళ్లిచేసుకోవాలని మేం అనుకున్నాం. పెళ్లికి అంతా సిద్ధం అయింది. శుభలేఖలు కూడా రెడీ అయ్యాయి. కరెక్టుగా ఐదారు రోజుల ముందు నాకు పెళ్లి వద్దని సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లేదని అన్నాడు. ఆ తర్వాత నా పెళ్లి జరుగుతున్న సమయంలో స్టేజ్ మీదకు వచ్చాడు. నా కళ్లలోకి చూశాడు. బయట కారు ఉంది. పారిపో అని నాకు సలహా ఇచ్చాడు” అని సాజిద్ నదియాడ్‌వాలా తెలిపారు. అయితే సల్మాన్‌తో పెళ్లి మిస్ అయిన ఆ యువతి ఎవరనే విషయాన్ని మాత్రం సాజిద్ వెల్లడించలేదు. గతంలో సల్మాన్ ఖాన్ చెప్పిన ప్రకారం.. నటి సంగీత బిజిలానీతో తన పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిందని చెప్పాడు.సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్‌లో చాలా కథలు వినిపిస్తాయి. చాలా కాలం కత్రినా కైఫ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడంటారు. తాజాగా సింగర్ లూలియా వంతుర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మంచు విష్ణుపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు