వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్‌రావు ఏకంగా రాజీనామా కూడా చేశారు. అయితే.. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పై నీతి ఆయోగ్ ఎట్టకేలకు స్పందించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, దాని కోసం వచ్చిన ప్రతిపాదనలు బిజినెస్ సీక్రెట్ అని.. బయటకు చెప్పటం కుదరదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రతిపాదన వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ( R T I) కింద చేసిన దరఖాస్తుపై నీతి ఆయోగ్ ఈ సమాధానం చెప్పింది. ఈ ప్రతిపాదనలను బయటకు చెప్తే.. వాణిజ్య పోటీ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని తెలిపింది. విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఈ వివరాలు అడిగారు. దీనిపై నీతి ఆయోగ్ స్పందించింది.
previous post
next post
కశ్మీర్ విభజనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు