telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

parliament sessions from today

జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 367 ఓట్లు వచ్చాయి. 67 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అంతకుముందు ఈ ప్రతిపాదిత బిల్లుపై హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభలో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఈ తీర్మానం బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు లభించగా, ఒక ఓటు తటస్థంగా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడనున్నాయి. దీంతో ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టయింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉంది.

Related posts