telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మోసగాళ్లు” టీజర్… ఆట ఇప్పుడే మొదలయ్యింది…!

Mosagallu

మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్‌-ఇండియ‌న్ ఫిల్మ్ ‘మోస‌గాళ్లు’. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మళయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నామని తెలుపుతున్నారు. ఇప్పటివరకు పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి టీజర్ ను ఈరోజు ఉదయం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి వారి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక టీజర్ విషయానికి వస్తే 2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ కోసం అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో మొదలయ్యి ఆ భారీ మొత్తాన్ని దోచే జంటగా విష్ణు అండ్ కాజల్ ఎండింగ్ ఇచ్చారు.

Related posts