telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సబ్బం హరి ఇంటి ప్రహరీని కూల్చేసిన అధికాలు!

Sabbam Hari Tdp

విశాఖ టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీని జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అధికారులు కూలిచివేశారని ఆయన ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతకు ఎలా వస్తారని సబ్బం హరి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఈ ఘటనపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ 12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారని తెలిపారు. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించామని పేర్కొన్నారు. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదన్నారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసామని చెప్పారు. నోటీసుకు స్పందించక పోవడంతోనే ఆక్రమించిన స్థలాన్ని తొలగించమని తెలిపారు.

Related posts