telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ : రానా దగ్గుబాటి ఇలా అయిపోయాడేంటి ?

Rana

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. రానా ప్రస్తుతం అమెరికాలో కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడు. దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేయకపోయినప్పటికీ.. రానా అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడని కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రానా అందుబాటులో లేని కారణంగానే కొన్ని సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. రానా తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ నిమిత్తం తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటో అతని అభిమానులకు షాక్ కలిగించింది. మంచి బాడీతో దృఢంగా ఉండే రానా ఇలా సన్నగా అయిపోవడంతో అభిమానులు షాకయ్యారు. చికిత్సలో భాగంగానే రానా ఇలా సన్నబడ్డాడని తెలుస్తోంది. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చి షూటింగ్‌లలో పాల్గొనడానికి రానా సిద్ధమవుతున్నాడు.

Related posts