telugu navyamedia
రాజకీయ

బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి..

పశ్చిమ బెంగాల్ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ గురువారం (నవంబర్ 4న) సాయంత్రం గుండెపోటుతో కోల్‌కతాలో కన్నుమూశారు. అతనికి 75 ఏళ్లు మరియు అతని భార్య ఉంది.

గుండె సంబంధిత సమస్యలతో మంత్రి గత వారం రోజులుగా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో ఉన్నారు. అతనకు యాంజియోప్లాస్టీ చేసి అతని గుండెలో అడ్డంకులు తొలగించడానికి రెండు స్టెంట్లను అమర్చారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉంది. అయితే, ఆయన గురువారం సాయంత్రం భారీ గుండెపోటుకు గురై రాత్రి 9 22 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Has Anand Bazar Patrika opened a can of worms for Mamata Banerjee? -  Oneindia News

ఆయన మృతి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి చేరుకుని ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆస్ప‌త్రిలో ఫిర్హాద్ హకీమ్, చంద్రిమా భట్టాచార్య, అరూప్ బిస్వాస్, పార్టీ ఎంపీ మాలా రాయ్ మరియు ఇతర నేతలతో సహా పలువురు కేబినెట్ మంత్రులు మ‌మ‌తా వెంట ఉన్నారు.

ఆయన మరణం పట్ల మమత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.. ఈ వెలుగుల పండుగలో, ఇది పెద్ద చీకటిలా అనిపిస్తుంది” అని అన్నారు. “నా జీవితంలో ఎన్నో విపత్తులు చూశాను. కానీ సుబ్రతా ముఖర్జీ మరణించడం నా జీవితంలో అతిపెద్ద విపత్తు అని ఆవేద‌న చెందారు. పార్టీని, తన నియోజకవర్గ ప్రజలను ప్రేమించిన అలాంటి వ్యక్తి మళ్లీ రాడు. నేను గోవా నుండి తిరిగి వచ్చిన తర్వాత, అతనిని ఆసుపత్రిలో కలిశాను. జిల్లాల పర్యటనలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ డాక్ట‌ర్స్‌ని అడిగి తెలుసుకొన్నాను.. గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావ‌డంతో వైద్యులు అతనిని పునరుద్ధరించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ కాప‌డ‌లేక‌పోయార‌ని ”అని బెనర్జీ విలేకరులతో అన్నారు.

Related posts