ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోదీ ఏంచేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉండేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మోదీ ముంచేశారని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీకి మీరెలా మద్దతిస్తారంటూ బాబు ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్