telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బదిలీ కేసు పై సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్!

MLC Elections in AP 5 unanimous
ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ కేసును హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారులను సీఈసీ బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ,  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ సీఈసీ మంగళవారం నాడు రాత్రి ఆదేశాలు జారీ చేసింది. 
ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నేతలు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు  ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం సీఈసీ సునీల్ ఆరోరాను టీడీపీ ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కలవనున్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదు చేసిందని టీడీపీ ప్రతినిధి బృందం వివరించే అవకాశం ఉంది. బదిలీ కేసు పై ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు కొట్టివేసిన నపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు  సమాచారం.

Related posts