telugu navyamedia
రాజకీయ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్ దాఖలు..

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోసం ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు నామినేషన్ పత్రాలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ సమర్పించారు.

Vice Presidential polls: NDA candidate Jagdeep Dhankhar files nomination,  vows to enhance country's democratic values - Jammu Kashmir Latest News |  Tourism | Breaking News J&K

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​సింగ్, నితిన్ గడ్కరీ, రామ్​దాస్ అథవాలే పాల్గొన్నారు. నామినేషన్ దాఖలకు ముందు జగదీప్ ధన్​ఖడ్.. భాజపా సహా ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు.

jagdeep dhankhar nomination 2022

మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కౌంటింగ్ అదే రోజు జరగనుంది.

నామినేష‌న్ అనంత‌రం ధన్​ఖడ్​ మాట్లాడుతూ ..దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాన‌ని, నాలాంటి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకత్వానికి కృతజ్ఞత‌లు తెలిపారు.

jagdeep dhankhar nomination 2022

భారత దేశ రెండో అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికైన జగదీప్ ధన్​ఖడ్​ రాజస్థాన్‌లోని.. ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. ఆయన కిసాన్‌పుత్ర అనే గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

Vice-Presidential Poll: NDA candidate Jagdeep Dhankar files nomination -  The Economic Times Video | ET Now

అనంతరం రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ధన్‌ఖడ్‌.. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

Related posts