కరోనాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేత భూమా అఖిలప్రియ తనపై నిందలు వేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలులో కరోనా వ్యాప్తికి తానే కారణమన్న ఆరోపణలు సరికాదని, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. చంద్రబాబు మెప్పు కోసమే అఖిలప్రియతనపై ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కర్నూలులో వైరస్ వ్యాపించి ప్రజలు చావాలని తాను ఎందుకు కోరుకుంటాను? అని ప్రశ్నించారు. వైరస్ ను అడ్డుకునే క్రమంలో అందరికంటే ముందు వరుసలో తాను ఉన్నానని, తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే కర్నూలు సెంటర్ లో ఉరేసుకుంటా నని సవాల్ విసిరారు. జిల్లాలో సమస్యల కూడా తెలియని అఖిలప్రియ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు