telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్​.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్​

రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వినియోగించుకున్నారు..వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం.. నేరుగా శాసనసభకు వచ్చి ఓటు వేశారు.

సోమవారం ఉదయం నుండి తెలంగాణ ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటు వేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఏఐఎంఐఎంలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూడు బస్సుల్లో అసెంబ్లీ ప్రాంగణానికి రాగ.. అంతకుముందే తెలంగాణ భవన్‌లో ఒక రౌండ్ మాక్ పోలింగ్ జరిగింది. ఇక సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌లు సైతం ఓటు వేశారు. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‍లు ఓటు వేయలేదు. కోవిడ్ కారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు వేయనున్నారు గంగుల కమలాకర్.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా, ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికల బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తారు.

Related posts