telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ జిల్లాల్లో చిరుత కలకలం…భయాందోళనలో ప్రజలు

లాక్‌డౌన్‌ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో చిరుత రెండు సార్లు అందరినీ కలవరపెట్టింది. తాజాగా… పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చిరుత కలకలం రేపింది. గోదావరిఖని వన్ ఇంక్లైయిన్ బొగ్గు గని వద్ద చిరుత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అక్కడ ఉన్న రెండు కుక్కలను సైతం చంపింది చిరుత. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత అడుగులను పరిశీలిస్తున్నారు. చిరుత అక్కడే తిరగడంతో కార్మికులు భయం గుప్పిట్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. అటు నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం యర్నగాన్ పల్లి శివారులోనూ చిరుత సంచారం చేసింది. అంతేకాదు.. వ్యవసాయ పొలం దగ్గర లేగదూడ పై దాడిచేసి చంపింది చిరుత. దీంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

Related posts