బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఓడిపోతామనే భయం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్ళాడని..గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హుందాగా మాట్లాడేవారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బండి సంజయ్ ఒక్క సీటు గెలవగానే ఎగిరి ఎగిరి పడుతున్నాడని…తెలంగాణ ఉద్యమ కారులను, ఉద్యమం చేసిన మహిళలను అవమానపరుస్తున్నాడని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని… మహిళ దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రైతు బంధు, రైతు భీమా, ఉచిత కరెంట్ ఇచ్చినందుకు జైలులో పెడతావ? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు జైలులో పెడతారా? అని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ను ఎందుకు జైలులో పెడతారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ అభివృద్ధి నిరోధకులుగా డీకే అరుణ మారారని.. గద్వాల్ లో మొహం చెల్లక మహబూబ్ నగర్ లో తిరుగుతుందని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ లాంటి పిచ్చి కుక్కను పదవీ నుండి తొలగించాలని బీజేపీ జాతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ కి పిచ్చి లేచినట్లుందని మండిపడ్డారు.
previous post