telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ పోటీపై పార్టీలో చర్చించి నిర్ణయం: కోదండరాం

Kodandaram

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జనసమితి నేత కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై ఆయన స్పందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగికదాడి కేసులో బాధిత యువతికి ప్రభుత్వం న్యాయం చేయాలనిడిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

మహిళా కమీషన్‌ను ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కోదండరాం విమర్శించారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పోరాడతామని అన్నారు. ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే సచివాలయం వంటి నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Related posts