telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేటీఆర్ సమయస్ఫూర్తి కి అభినందనలు

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపధ్యలో అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ ప్రతిపక్షాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందుకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనను చెప్పుకోవచ్చు. ఈనెల 2వ తేదీ న గాంధీ జయంతి రోజున తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇద్దరు మహాత్మునికి నివాళులు అర్పించడానికి బాపు ఘాట్ కు వెళ్లారు.

తెలంగాణ రాష్ట్ర ఐటి , పురపాలక మంత్రి మంత్రి కె .టి .ఆర్ కూడా వెళ్లారు. బాపుకు గవర్నర్ల తో పాటు కె.టి.ఆర్ కూడా నివాళులు అర్పించారు. కార్యక్రమం అయిపోయిందని టి.ఆర్ .ఎస్ నాయకులు కె.టి.ఆర్ వాహన డ్రైవర్ కు చెప్పడంతో అతను హడావిడిగా తన వాహనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లాడు. ఆ వాహనం మంత్రి కె .టి .ఆర్ ది అని తెలియక విధి నిర్వహణలో వున్న ట్రాఫిక్ ఎస్ ఐ ఐలయ్య , కానిస్టేబుల్ వెంకటేశ్వర్ దానిని ఆపారు. ఆ తరువాత టి .ఆర్ .ఎస్ నాయకు చెప్పడంతో దానిని వదిలి వేశారు.
అయితే అప్పటికే ఈ సంఘటన మీడియా కంట పడింది.

నిజానికి ఆ వాహనంలో కేటీఆర్ లేరు. అయినా మంత్రి వాహనం కాబట్టి కెమెరా ఫ్లాష్ లు వెలిగాయి. తరువాత రోజు ఈ సంఘటన మీడియాలో వచ్చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఉలిక్కిపడి దిద్దుబాటు చర్య కు ఉపక్రమించారు. పోలీస్ ఉతాధికారులతో మాట్లాడి ఆ ఇద్దరు ట్రాఫిక్ అధికారులను సోమవారం రోజు తన కార్యాలయానికి పిలిపించి సత్కరించి మరీ చలాన్ చెల్లించారు. ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వేంకటేశ్వర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన మంత్రి కేటీఆర్ కొత్త సంప్రదాయానికి నాంది పలికారు.

Related posts