telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలి రద్దుపై చంద్రబాబు చర్చ.. పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ

chandrababu

శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించి ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు, గవర్నర్, శాసనసభ స్పీకర్కు టీడీపీ శాసనసభా పక్షం లేఖ రాసింది. సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బీఏసీలో నిర్ణయించారని తెలిపింది. బీఏసీకి చెప్పకుండానే ఇష్టానుసారం సభను మరో మూడు రోజుల పాటు పొడిగించారని ఫిర్యాదు చేసింది.

Related posts