telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు పార్టీ నేతలతో పవన్ టెలి కాన్ఫరెన్స్

pawan

రాజధాని తరలింపు వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. దీనిపై జనసేన పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. అయితే అంశంలో కోర్టు ఆదేశాలు అందాల్సి ఉందని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈలోపు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

పార్టీ నేతలతో రేపు పవన్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజధాని తరలింపు, ఇతర పరిణామాలపై పవన్ తన పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాజధాని తరలింపుపై కౌంటర్ దాఖలుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు.

Related posts