telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గ్లాసు బీరుకు అక్షరాలా రూ. 71 లక్షల 66 వేల బిల్ కట్టాడు…!?

Beer

ఆస్ట్రేలియాలో క్రికెట్ రైటర్‌గా, రచయితగా ఉన్న పీటర్ లాలర్ అనే వ్యక్తికి ఈ సంఘటన ఎదురైంది. గత ఆదివారం మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ హోటల్‌కు వెళ్లిన పీటర్.. బేరర్‌ను అమెరికన్ బీర్ కూడా బ్రిటిష్ బీర్ ఏదైనా ఉందా అని అడిగాడు. అతడికి తెలియక వేరే అమ్మాయిని పిలవగా.. ఆమె హెలెన్‌కెన్ బీర్‌ను పీటర్‌కు ఇచ్చింది. బీర్ తాగిన తరువాత పీటర్ కార్డు ద్వారా బిల్లు చెల్లించాడు. రిసీప్ట్ వద్దంటూ బిల్లు ఎంతైందని ఆమెను అడగగా.. ఆమె తడబడటం మొదలుపెట్టింది. దీంతో పీటర్‌కు అనుమానం వచ్చి తప్పు ఏమైనా జరిగిందా అని ప్రశ్నించాడు. వెంటనే అక్కడకు మేనేజర్ చేరుకుని కొంచెం ఎక్కువ మొత్తం కట్ అయిందని.. తిరిగి రిఫండ్ చేసేస్తామంటూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో పీటర్‌కు ఇంటి నుంచి కాల్ వచ్చింది. తన బ్యాంకు అకౌంట్ నుంచి 99,983.64 డాలర్లు(రూ. 71 లక్షల 66 వేలు) కట్ అయినట్టు తెలిపారు. దీంతో పీటర్ ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే బార్ సిబ్బందిని నిలదీశాడు. వారు క్షమాపణలు తెలిపి మూడు రోజుల్లో రిఫండ్ అయిపోతాయంటూ చెప్పడంతో పీటర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంత మొత్తం డబ్బు కట్ అవడానికి బ్యాంకు ఎలా అంగీకరించిందో తనకు అర్థం కావడం లేదని.. పీటర్ తనకు జరిగిన అనుభవాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. మూడు రోజుల్లో వస్తాయనుకున్న డబ్బులు తొమ్మిది రోజుల తరువాత వచ్చాయని చెప్పాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన బీరు తాగానంటూ హాస్యంగా పీటర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts