telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “క్యాస్ట్ ఫీలింగ్” సాంగ్… వీడియో వైరల్

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే… మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఈ చిత్రం నుంచి “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ నటించిన ‘సాహో’ విడుదలకు సిద్ధం కానుండగా, ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రంలోని ఒక పాటను ఈ నెల 27న ఉదయం 9గం.27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం” అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన చెప్పిన మేరకే ఈ రోజు ఉదయం వర్మ సాంగ్ ను విడుదల చేశారు. కులాభిమానం కలిగిన ప్రతీవారికి ఈ సాంగ్‌ను అంకితం చేస్తున్నానని ట్వీట్ చేస్తూ వర్మ ఈ పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, సీఎం జగన్ , పవన్ కల్యాణ్, ప్రభాస్, ఉండవల్లి, మాజీ సీఎం రోశయ్య విజువల్స్ వాడారు వర్మ. “కమ్మలు… కాపులు… రెడ్లు… రాజులు… వైశ్యులు…” అంటూ ఈ పాట మొదలవుతుంది. ఈ పాటకు ముందు క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ సెటైర్లు కూడా వేశారు. ప్రముఖ మీడియా ఛానల్‌లో వచ్చే స్లోగన్స్‌ పై సెటైర్లు వేస్తూ వర్మ పాట పూర్తవుతోంది. కాగా ఈ పాటను వర్మనే స్వయంగా పాడారు. మేము కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts