telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమ్మాయిల పరిస్థితి భయంకరంగా తయారైంది: మంత్రి తానేటి వనిత

vanitha tatineni minister

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇప్పటికే ఈ హత్య పై పలువురు నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఈ ఘటన పై స్పందించారు. ప్రియాంక హత్య ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.

ప్రియాంక రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు అమ్మాయిల పరిస్థితి భయంకరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గులు ప్రియాంకను ఎంత వేధించి ఉంటారో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ పరిధిలో లేకపోయినా పోలీసులు రక్షణ కల్పించాలని మంత్రి సూచించారు.

Related posts