telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న విమానం… ఎలాగంటే ?

Plane

విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. హార్బిన్ నగరంలో ఓ విమానాన్ని పెద్ద ట్రక్కుపై తరలిస్తున్నారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ ఫ్లైట్ రెక్కలు తొలగించారు. ఐతే, దురదృష్టవశాత్తూ ఆ విమానం ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. దాంతో ఇరుక్కుపోయిన ఆ ఫ్లైట్ ను బ్రిడ్జ్ కింద నుంచి బయటకు తీయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ముందుగా డ్రైవర్లు, ట్రక్కు టైర్లలో గాలిని కొంచెం తగ్గించారు. దాంతో ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని కొంచెం ముందుకు కదలించారు. ఎట్టకేలకు బ్రిడ్జి కింద నుంచి వాహనం బయటికి వచ్చింది. ఆ తర్వాత టైర్లలో మళ్లీ గాలి నింపి విమానాన్ని అక్కడి నుంచి తరలించారు.

Related posts