telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

బ్యాలెట్‌ పేపర్‌తోనే నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికలు: ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్న గురువారంతో ముగిసింది. దీంతో ప్రధానపార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. స్క్రూటినీ తరువాత మొత్తం 17 నియోజకవర్గాల్లో 503 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.  రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 185 మంది పోటీచేస్తున్నారు.
ఈ  నియోజకవర్గంలో బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించనుంది. అయితే అభ్యర్థుల వివరాలను తెలపాలని రిటర్నింగ్‌ అధికారికి ఈసీ ఆదేశించింది. బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు పెద్ద కష్టమేమీకాదన్న ఈసీ తెలిపింది.

Related posts