telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 తగ్గి రూ. 50,260 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 తగ్గి రూ. 46,700 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ. 48,600 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,550 పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 1500 తగ్గి రూ. 72,900 కి చేరింది.

Related posts