telugu navyamedia
రాజకీయ

బెంగాల్‌ అసెంబ్లీలో కుమ్ములాట‌..ప‌లువురికి గాయాలు

*బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ
*ఐదుగురు బీజేపీ స‌భ్యులు స‌స్పెండ్‌..

*బీర్‌భూమ్‌ హింస ఘ‌ట‌న‌పై ర‌గ‌డ‌

బెంగాల్ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది . దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారణంగా ఉందని బీర్​భూమ్ ఘటనను ప్రస్తావిస్తూ భాజపా ఎమ్మెల్యేలు వారు ప్రశించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు.

అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురు ఎమ్మెల్యేలకు తీవ్రగాయాలయ్యాయి.  

అనంతరం ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు  సువేందు అధికారి, మనోజ్‌ టిగ్గా, నరహరి మహతో, శంకర్‌ ఘోష్‌, దీపర్‌ బర్మాన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు వారికి సభలో అనుమతి లేదని పేర్కొన్నారు.

 మార్చి 21న  బీర్‌భూం జిల్లాలో బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భాదు షేక్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు.

భాదు షేక్‌ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్‌ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Related posts